దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 19 పాయింట్ల లాభంతో 66,080 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 19 పాయింట్లు లాభంతో 19,584 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడి 82.145 వద్ద ట్రేడవుతోంది. ఏజీఐ గ్రీన్‌పాక్, జస్ట్‌డయల్, సుబెక్స్ లిమిటెడ్, ఐయాన్ ఎక్స్ఛేంజి కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.