చాలా మంది బ్రష్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అయితే ఎలా పడితే అలా బ్రష్ చేస్తే దంతాలపై ఉండే ఎనామిల్ పొర పాడవుతుంది. కాబట్టి మృదువుగా ఉండే బ్రష్ ఎంచుకుని, దంతాలపై వృత్తాకార పద్ధతిలో బ్రష్‌తో తోమాలి. రోజుకు రెండు సార్లు బ్రష్ చేస్తే దంతాలు శుభ్రంగా ఉంటాయి. ఇక బ్రష్‌లను సుదీర్ఘ కాలం వాడకపోవడం మంచిది. టంగ్‌క్లీనర్‌తో నాలుకపై గట్టిగా లాగకూడదు. ఇలా చేస్తే నాలుకపై రుచి గుళికలు పాడవుతాయి.