2026లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన కామన్వెల్త్ క్రీడలను రద్దు చేశారు. విక్టోరియా రాష్ట్రం ఆ క్రీడలను నిర్వహించేందుకు వెనుకడుగేసింది. బడ్జెట్ కారణంగా కామన్వెల్త్ క్రీడల్ని నిర్వహించలేకపోతున్నట్లు ప్రకటించింది. దాంతో క్రీడా పోటీల నిర్వహణకు మరో హోస్ట్ నగరాన్ని గుర్తించలేకపోయినట్లు కామన్వెల్త్ గేమ్స్ ఫేడరేషన్ (సీజీఎఫ్) పేర్కొంది. విక్టోరియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుత్సాహపరిచిందని సీజీఎఫ్ తెలిపింది. దీనికి త్వరలో పరిష్కారాన్ని కనుక్కోనున్నట్లు వెల్లడించింది.