ఆసియాకప్ షెడ్యూల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) విడుదల చేసింది. మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగనున్నారు. ఆగస్టు 30న ముల్తాన్లో పాకిస్తాన్, నేపాల్ మధ్య జరగనుంది. సెప్టెంబర్ 2న క్యాండీలో భారత్, పాకిస్తాన్ మధ్య పోరు ఉండనుంది. సెప్టెంబర్ 4న భారత్తో నేపాల్ తలపడనుంది. భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న వైవిధ్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు ఏసీసీ వెల్లడించింది.