హుస్సేన్‌సాగర్ వేదికగా జరుగుతున్న వైఏఐ మాన్సూన్ రెగెట్టా జాతీయ చాంపియన్‌షిప్‌లో సెయిలర్ ఏకలవ్య బాతమ్ స్వర్ణ పతకం గెలిచాడు. బాలుర అండర్-15 అప్టిమిస్టిక్ విభాగంలో ఏకలవ్య 15 పాయింట్లతో ముందంజలో నిలిచాడు. మరోవైపు అండర్-19 విభాగంలో తెలంగాణకు చెందిన ధరణి లావేటి, వడ్ల మల్లేష్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అండర్-15 విభాగంలో దీక్షిత కొమురవెల్లి 52 పాయింట్లతో ముందంజలో ఉంది.