పచ్చి అరటికాయలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. బరువు తగ్గడంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వారానికి రెండు, మూడు అరటిపండ్లు తింటే అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది. ఇందులోని పొటాషియం వల్ల శరీర కండరాలు మెరుగుపడతాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పచ్చి అరటి పండ్లలో విటమిన్-సీ, ఫైటోన్యూట్రియెంట్స్, యాంటీఆక్సిడెంట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.