ఆసీస్ స్టార్ బ్యాటర్, ఆర్సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ మ్యాక్స్‌వెల్ తండ్రి కాబోతున్నారు. మ్యాక్స్‌వెల్ భార్య వినీ రామన్‌కు భారతీయ సాంప్రదాయ పద్ధతిలో సీమంతం చేశారు. సెప్టెంబర్‌లో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ జంట 2022లో ఆస్ట్రేలియాలో క్రైస్తవ మత ఆచారంలో, ఆ తర్వాత ఇండియాలో తమిళ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. విని రామన్ భారతీయ మహిళ కాగా ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు.