ట్రెండింగ్
Epaper    English    தமிழ்

23.07.2023 నుండీ 29.07.2023 వరకూ ద్వాదశ రాశి ఫలాలు

Astrology |  Suryaa Desk  | Published : Wed, Jul 26, 2023, 11:08 AM

1) మేషరాశి.... (అశ్విని, భరణి,  కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ,  లూ, లే, లో,ఆ)

వారం ప్రారంభంలోతల్లి తరపు బంధువులతో  ఒక విషయాన్ని చర్చిస్తారు.పాత రుణములు చెల్లిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల కొరకు బాగా ప్రిపేర్ అవుతారు.  వారం మధ్యలోఅవార్డులు అందుకుంటారు, గౌరవము గుర్తింపు పెరుగుతుంది. వృత్తిపరంగా భాగస్వామితో తాత్కాలికంగా ఎడబాటు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. నూతన సంస్థలలో వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. పెద్దలతో విభేదాలు రాకుండా ముందుకు వెళ్లాలి.  సంతానానికి ప్రభుత్వపరమైన వృత్తి కొరకు ప్రయత్నాలు ముందుకు వెళతాయి. వారము చివరిలో మిత్రులతో షాపింగ్ లు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్య, ఆహార విశ్రాంతి విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. కొత్త ప్రదేశాలలో వృత్తిపరంగా ఆకస్మిక అవకాశాలు. భూ సంబంధమైన దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు.  అవసరము అయితే నిర్లక్ష్యము చేయకుండా వైద్యున్ని సంప్రదించాలి. మంచి ఫలితాల కొరకు దుర్గాదేవి ఆరాధన మంచిది.

2) వృషభరాశి...(కృతిక 2,3,4 పాదాలు, రోహిణి,మృగశిర 1,2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  

వారం ప్రారంభంలో ఆత్మీయుల కొరకు ఆకస్మిక ఖర్చు ఉంటుంది. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్ మొదలైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంతానం పోటీ పరీక్షల్లో అధిక శ్రద్ధ చూపిస్తారు.ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు పొందుతారు. పాత బకాయిలు కొంతవరకు చెల్లిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.ప్రభుత్వపరమైన వృత్తి కొరకు ప్రయత్నం చేసే వారికి సహకారం అందుతుంది. కృషి శీలత పెరుగుతుంది, రహస్య శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తిలో అభివృద్ధితోపాటు కొత్త అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వివాహ ప్రయత్నాలు లో కొంత ఆలస్యాలు అవరోధాలు చికాకు తెప్పిస్తాయి.  స్త్రీలు తమ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. భాగస్వామి తో అభిప్రాయ భేదములు, అపార్థములు రాకుండా జాగ్రత్త వహించాలి. కుటుంబంలోని స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్ధాలు రాకుండా మాట్లాడటం మంచిది.  మంచి ఫలితముల కొరకు అమ్మవారి ఆరాధన, దేవాలయ సందర్శన మంచిది.

3) మిధున రాశి...(మృగశిర 3,4  పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  

వారం ప్రారంభంలో గృహంలోని వాతావరణం ఆశించిన స్థాయిలో సంతృప్తిని ఇవ్వదు. విద్యార్థులు విద్య పై ఆసక్తిని, జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. నూతన అంశాలు తెలుసుకుంటారు. విద్యార్థుల హాస్టల్ వసతి కొరకు ప్రయత్నాలు బాగా చేస్తారు. సమయమునకు తగిన ఆహార స్వీకరణ మంచిది. వారం మధ్యలోఉపాసన బలం పెరుగుతుంది. ఆధ్యాత్మిక అంశముల కొరకు చేయు ప్రయత్నాలు యందు అవరోధాలు అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఎంతో కాలం ఎదురు చూస్తున్నా ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు భాగస్వామి, సంతానమునకు ప్రభుత్వపరమైన అవకాశములు కొరకు ప్రయత్నాలు, ఆలోచనలు ఫలిస్తాయి. వారం చివరిలో రుణములు చెల్లిస్తారు, క్రొత్త రుణముల కొరకు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.ఆత్మీయులతో మాట్లాడే సందర్భములో కలహములు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి.వ్యక్తుల సహకారం ఆశించినట్టుగా ఉంటుంది.ధైర్యం పెరుగుతుంది పరాక్రమం పెరుగుతుంది ముఖ్యమైన విషయాల విజయాన్ని సాధిస్తారు. మంచి ఫలితములు కొరకు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు సందర్శన మంచిది.

4) కర్కాటక రాశి...(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)

వారం ప్రారంభంలో  చిన్న క్షేత్ర ప్రయాణాలు చేస్తారు.ఎంతోకాలంగా అనుకున్నది సాధించి ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో సోదరీ సహకారం బాగుంటుంది, తల్లి తరపు బంధువులను కలుస్తారు, గృహ మార్పుకే ఆలోచనలు చేస్తారు. వాహన కొనుగోలు కొరకై ఆత్మీయులను కలిసి చర్చిస్తారు.ఆర్థికంగా తండ్రి గారు, విదేశాలలో ఉండే మిత్రులు సహకరిస్తారు.  వారం మధ్యలో పోటీ పరీక్షల   కొరకు విద్యార్థులు విశేషంగా కృషి చేస్తారు. రాజకీయ నాయకుల, ఉన్నతాధికారు లను వృత్తిపరమైన విషయాలలో సంప్రదిస్తారు.చివరిలో కొత్త పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టమైన వారి కోసం అధికంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి.  ఆధ్యాత్మిక బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు.సంతాన అభివృద్ధి విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు వికసిస్తాయి. మంచి ఫలితాల కొరకు సుబ్రమణ్య స్వామి ఆరాధన మంచిది.

5) సింహరాశి...(మఖ, పుబ్బ, ఉత్తర 1వ  పాదం)  (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)

వారం ప్రారంభంలో వాగ్దానాల అంశాలలో, ఆకస్మిక ఖర్చులలో  నిదానము అవసరం.
ఆర్థిక సంబంధమైన విషయాలలో, ఇతరులతో వ్యవహరించే అంశాలలో జాగ్రత్తలు తీసుకుని వలెను. వారం మధ్యలోకుటుంబ వ్యక్తుల ,పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుల సహకారంతో సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రులు తోబుట్టువులు సహకరిస్తారు ధైర్యం పెరుగుతుంది. సంతానం  వారి నిర్ణయాల విషయంలో, మీరు ఆలోచించి ముందుకు వెళ్లడం అవసరం. వారం చివరిలోఆరోగ్యముపై తగ్గిన శ్రద్ధ అవసరము. నూతన అంశాలు తెలుసుకుంటారు సమయానికి ఆహార స్వీకరణ మంచిది. విద్యార్థులు విద్యా విషయాలలో తగిన శ్రద్ధ చూపాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు, నూతన పరిచయాల వలన  ఖర్చులు అధికము.
వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యులతో కలిసి దీర్ఘకాలికి పెట్టుబడులకై ఆలోచనలు చేస్తారు.  మంచి ఫలితాల కొరకు అమ్మవారి ఆరాధన, దేవాలయ సందర్శన మంచిది.

6) కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4  పాదాలు, హస్త  4వ పాదం, చిత్త 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: టో , పా, పి, పూ , షం , ణా, పే,పో)

వారం ప్రారంభంలో ఆలోచనలు మీకు విస్మయాన్ని కలిగిస్తాయి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గౌరవనీయమైన వ్యక్తుల, విదేశీ వ్యక్తుల నూతన పరిచయాలు, పలుకుబడి పెరుగుతుంది. కొత్త ఆలోచనలు చేస్తారు.  వారం మధ్యలో ఉన్నత పదవులలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారంతో కొత్త పెట్టుబడుల కొరకు ఆలోచిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు,  బ్యాంకింగ్ మొదలైన పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతారు. వారం మధ్యలో సంతానం సంబంధ విషయంలో ఎంతగానో ఎదురు చూస్తున్నా వార్త అందుతుంది. వృత్తిపరంగా అభివృద్ధి.ప్రయాణాలు లభిస్తాయి, నూతన పరిచయాలు , ధైర్యం పరాక్రమం పెరగడం, భూ సంబంధ అంశాలలో ఆశించిన ఫలితాలు.  మంచి ఫలితాల కొరకు విష్ణుమూర్తి దేవాలయాల సందర్శించడం మంచిది.

7) తులారాశి...(చిత్త 3 4  పాదాలు, స్వాతి, విశాఖ 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    

వారం ప్రారంభంలోవృత్తిపరమైన అలసట, ప్రశాంతత తక్కువ, నిద్రలేమి. శారీరక శ్రద్ధ అవసరము. అయినప్పటికీ చురుకుగా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టమైన వస్తువులకు కొనుగోలు కొరకు అధికవ్యయం.సమయ స్ఫూర్తిగా ఆలోచిస్తారు. వారం మధ్యలోవ్యాపార రంగంలో వారు సహకరిస్తారు. విద్యార్థులకు అనుకూలం. విదేశీ విద్య కొరకై చేయు ఆలోచనలు కొలిక్కి వస్తాయి. పౌరుషం కోపం కొంత పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు, దర్పంగా ఉంటారు. వారం చివరిలో రుణముల కొరకు ప్రయత్నాలు చేస్తారు. వస్త్రములు, షాపింగ్ కొరకు ఆకస్మిక ఖర్చులు.  ఆర్థిక విషయాలు గృహ సంబంధ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోవాలి, మాటల వలన అపార్థులకు అవకాశం ఎక్కువ. మంచి ఫలితములు కొరకు సాయిబాబా మందిరము దర్శించటమేలు.

8) వృశ్చిక రాశి...(విశాఖ  4వ పాదం, అనురాధ, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   

ప్రారంభంలో చాలాకాలంగా ఎదురుచూస్తున్న వార్త అందుకుంటారు. సంతాన అభివృద్ధి కరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. సభలకు సమావేశాలకు హాజరు అవుతారు. వాతావరణం అనుకూలంగా ఉంటుంది, చురుకుగా ఉత్సాహంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఇష్టమైన  ఆత్మీయుల కొరకు అధిక ఖర్చులు చేస్తారు. అవసరమైన వారి కొరకు విరాళాలు ఇస్తారు. విదేశీ ప్రయాణ విషయంలో కొత్త నిర్ణయానికి వస్తారు. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. విద్యార్థులకు విద్యాసంబంధ ప్రయాణాలు ఉంటాయి. వారము చివరిలో సహకరించరు అనుకున్న వ్యక్తుల సహకారం ఆనందాన్నిస్తుంది. లలిత కళలపై ఆసక్తిని పెంచుకుంటారు. కుటుంబ సభ్యులతో అపార్ధాలు లేకుండా ముందుకు వెళ్లాలి. దూర ప్రాంతాల్లో ఉండే గురువుల ఆశీస్సులు అందుకుంటారు.వ్యక్తిగత శ్రద్ధ ఆకర్షణ పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తగవు. మంచి ఫలితాల కొరకు గణేష్ మందిరాల సందర్శన మంచిది.

9) ధను రాశి...(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ  పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)     

వారం ప్రారంభంలో అలసట బడలిక కొత్త బాధ్యతలు. శక్తివంచన లేకుండా మీ విధానంలో మీరు బాధ్యతాయుతంగా పనులు నెరవేరుస్తారు. వృత్తి పరంగా అభివృద్ధి ఉంటుంది. స్వ గ్రామానికి వెళ్లడానికి ఆలోచనలు చేస్తారు. వారం మధ్యలోరాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయ సహకారంతో నూతన నిర్ణయాలకు శ్రీకారం చుడతారు. పడిన కష్టానికి ప్రతిఫలాన్ని పొందుతారు. వృత్తిలో ఆదాయం అభివృద్ధి, ఉన్నత అధికారుల ప్రశంసలు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం. వారం చివరిలో విభేదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆత్మీయులను సంప్రదించాలి. కొత్త వ్యక్తుల పరిచయాలలో ఆచితూచి అడుగు వేయాలి. వాహనాలు నడిపేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్య స్తోత్రం పటించుట మేలు.

10) మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4  పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: భో , జా , జి, ఖి,ఖు, ఖే, ఖో, గా, గి)

వారం ప్రారంభంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. తెలియని అసంతృప్తి. ప్రశాంతత లోపం. అధిగమించడానికి పుణ్యబలాన్ని పెంచుకోవాలి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. దూర ప్రయాణాలు కొరకు ఆలోచిస్తారు. వారం మధ్యలోఉన్నత స్థాయి అధికారులు ప్రశంసిస్తారు. అధికారంలో ఉండే వ్యక్తి సహకారం లభిస్తుంది. నూతన వృత్తుల కొరకు ప్రయత్నించే నిరుద్యోగులకు కొంత అనుకూలమైన సమయం. వృత్తిపరమైన ప్రయాణాలు, అలసట అధిక బాధ్యతలు. అయినప్పటికీ అభివృద్ధి కరంగా ఉంటుంది. వృత్తిలో గౌరవం పెరుగుతుంది. శ్రమకు తగ్గ ఆదాయాన్ని అందుకుంటారు. వారం చివరిలో భాగస్వామికి అనుకూలముగా ఉంటుంది. భూ సంబంధ కొనుగోలు విషయాలలో ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం బాగుంటుంది శారీరక శ్రద్ధ పెరుగుతుంది ఆకర్షణీయమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆశించిన లాభాలను ఆర్జిస్తారు.  మంచి ఫలితాల కొరకు సూర్య ఆరాధన మంచిది.

11) కుంభ రాశి...(ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    

వారం ప్రారంభంలో అనవసర ప్రయాణాలు, ఖర్చులు, ముఖ్యమైన పనులు వాయిదా కొంత అశాంతిని పెంచినప్పటికీ అసంతృప్తికి లోను కాకుండా ధైర్యంగా ముందుకు వెళతారు.ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అనుకోని వ్యక్తుల విమర్శలు, కొత్త వ్యక్తుల జోక్యం ముఖ్య అంశాలలో  చికాకును పెంచుతాయి. సమయానికి ఆహార స్వీకరణ, విశ్రాంతి అవసరం. వాగ్వాదాలకు దూరంగా ఉండుట మేలు. వారం మధ్యలోసమయానికి మాట సహాయం చేయవలసిన ఆత్మీయులు మొహం చాటు వేయడంతో కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళతారు.  భూమి, గృహ  సంబంధిత ఆర్థిక అంశాలలో, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు ఎక్కువ శ్రద్ధతో చదవాలి. కొత్త రుణముల కొరకు ప్రయత్నాలు చేస్తారు.మీదైన భూ సంబంధ అంశాలలో నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరంగా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి.  మంచి ఫలితముల కొరకు శ్రీకృష్ణ మందిరములు దర్శించుట మేలు

12) మీన రాశి...(పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) (నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)

వారం ప్రారంభంలో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కళాకారులకి దూర ప్రదేశాలలో అవకాశములు. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు.వ్యాపార, వృత్తిపరమైన భాగస్వాము లతో ఘర్షణ లేకుండా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలి. వారం మధ్యలో ముఖ్యమైన పనుల యందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తిపరంగా విమర్శలకు అవమానాలకు లోను కాకుండా జాగ్రత్తలు అవసరం. భాగస్వామి ఆరోగ్య విషయంపై తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఒక సమాచారం ఆలోచనను కలిగిస్తుంది. పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఎదురైనప్పటికీ సంయమనం పాటించాలి. వృత్తిపరంగా అధికారులను, రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని కలవడానికి ప్రయత్నాలు చేస్తారు. సంతానము విద్యపై, అభివృద్ధిపై శ్రద్ధ చూపిస్తారు. తండ్రిగారి ఆరోగ్యం, సలహాలపై  శ్రద్ధ అవసరము. గృహ, వాహన రిపేర్లకి ఖర్చువీలైనంత ఆలోచించి ముందుకు వెళ్ళుట అవసరము.   మంచి ఫలితములు కొరకు రామాలయ సందర్శన మంచిది.

(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత  జాతకము లోని దశ  అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com