చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్ జోరు కనబరుస్తోంది. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు మూడు స్వర్ణాలు, ఒక కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ స్వర్ణం, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో యువ షూటర్ ఎలావెనిల్ వాలరివన్ పసిడి పతకాలతో మెరిశారు. టీమ్ ఈవెంట్లో యశ్వసిని సింగ్, అబింద్యా, మనుభాకర్ మరో పసిడిని గెలిచారు. మహిళల 57 కేజీల జూడోలో యామిని మౌర్య కాంస్య పతకాన్ని గెలుచుకుంది.