ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వార ఫలాలు: 30.07.2023 నుండి 05.08.2023 వరకు ద్వాదశ రాశి ఫలాలు

Astrology |  Suryaa Desk  | Published : Mon, Jul 31, 2023, 10:57 AM

1) మేషరాశి.... (అశ్విని, భరణి,  కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ,  లూ, లే, లో,ఆ)

ఈ రాశి వారికి వారం ప్రారంభంలో శుభకార్యాలలో పాల్గొనడం, కుటుంబ పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, క్షేత్ర సందర్శన. తదుపరి వృత్తిపరమైన బాధ్యతలు ఉన్నత వ్యక్తులతో పాటు రాజకీయ, కళాకారుల సహకారంతో అనుకున్న పనులు చక్కగా నిర్వర్తిస్తారు. గృహల్లోని వాతావరణంలో కొంత ప్రశాంతత లోపించినప్పటికీ ముఖ్యమైన పనుల విషయంలో తల్లిదండ్రులతో సంప్రదించి ఆలోచనలను చేస్తారు. సంతానం విషయంలో క్రొత్త బాధ్యతలు, కుటుంబంలోని వాతావరణ ఆహ్లాదకరంగా బంధుమిత్రులతో ఉంటుంది. వారము మధ్యలో ఆకస్మిక ధన లాభం, ఎదురుచూస్తున్న విషయాలలో ఆనందకరమైన వార్తలు. శ్రమ పెరిగినప్పటికీ ఆదాయం అభివృద్ధి. వాయిదా పడిన పనులు ముందుకు వెళతాయి. వృత్తిలో కొత్త అవకాశాలు గృహ స్థిరాస్తుల విషయంలో ఆత్మీయులను సంప్రదిస్తారు కొత్త వ్యాపారంల కొరకు ప్రణాళికలు వేస్తారు అధిక ఆదాయమునకు చేయు కృషి సత్ఫలితాలను ఇస్తుంది. వారాంతంలో కుటుంబంలో స్త్రీల ఆరోగ్యం పై శ్రద్ధ. ఖర్చులు పెరుగుతాయి రుణాలు చెల్లిస్తారు సమావేశాల్లో పాల్గొంటారు. మంచి ఫలితాలు కొరకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం సందర్శన మేలు

2) వృషభరాశి...(కృతిక 2,3,4 పాదాలు, రోహిణి,మృగశిర 1,2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  

ఈ రాశి వారికి వారం ప్రారంభంలో  మాటల వల్ల ఆకస్మిక కలహాలు లేకుండా జాగ్రత్త వహించాలి. ఊహించని ఖర్చులు అధికంగా ఉంటాయి. స్త్రీల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. పనులు వాయిదా పడకుండా ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలి. రావలసిన ధనం కొంత వాయిదా పడుతుంది, వారం మధ్యలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు మిత్రులను కలుస్తారు, తండ్రిగారి సహకారంతో నిర్ణయి సామర్థ్యం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రాథమిక విద్య మీద ఆసక్తి పెరుగుతుంది. మధ్యలో వృత్తిలో నూతన బాధ్యతలు, శ్రమ అలసట పెరిగినప్పటికీ గౌరవము కీర్తి పెరుగుతుంది. స్త్రీ సంతానానికి విద్య, వృత్తి అంశాలలో దూర ప్రదేశాలలో నూతన అవకాశాలు. భాగస్వామికి కొత్త ప్రదేశానికి బదిలీలు. నూతన గృహ ప్రయత్నాలకు అవకాశము. వారము చివరిలో వాయిదా పడ్డ పనులు ముందు కదులుతాయి మిత్రులు తోబుట్టువులు సహకరిస్తారు, సంతోష్కరమైన వాతావరణం. శుభ విషయాలు నిమిత్తమై ఖర్చులు అధికమవుతాయి. మంచి ఫలితాలు కొరకు దుర్గాదేవి ఆరాధన మంచిది

3) మిధున రాశి...(మృగశిర 3,4  పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  

వారం ప్రారంభంలోఆకస్మిక చిన్నపాటి ప్రయాణాలు, కొంత అలసట. సంఘ సేవ చేస్తారు కొంత మానసిక సంతృప్తి ఉంటుంది. సంఘంలో గుర్తింపు గౌరవం అవార్డులో అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు. సహకారాలు. శ్రమకి తగిన గుర్తింపు గౌరవం. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.వారం మధ్యలో ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు.  ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెరుగుతుంది వ్యాయామం చాలా మంచిది. వైరాగ్య భావనల్ని అసంతృప్తిని అధిగమించాలి. సంతానము ఉన్నత విద్యా విషయంలో విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. తోబుట్టువుల సహకారంతో అపార్ధాలు రాకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పరాక్రమం ధైర్యం పెరుగుతుంది. రుణాల చెల్లిస్తారు. నూతన విద్యా విషయాలు తెలుసుకుంటారు. వారం చివరిలో వృత్తిపరమైన ఆదాయం లభిస్తుంది గౌరవము, శ్రమ, వృత్తిపరమైన బాధ్యతలు పెరుగుతాయి. మంచి ఫలితాలు కొరకు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు సందర్శించుట మేలు.

4) కర్కాటక రాశి...(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)

వారం ప్రారంభంలో శత్రువులపై విజయం సాధిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి దర్పంగా ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయాలలో ముందుకు వెళ్లడం కొరకు పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. శారీరక శ్రద్ధ పెరుగుతుంది వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది సంఘంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో తోబుట్టువులతో, సంతానముతో అపార్ధాలు రాకుండా మాట పట్టింపులు లేకుండా జాగ్రత్త వహించాలి. వారం మధ్యలో ఆరోగ్య విషయం లో బద్ధకించకుండా ప్రణాళికా పరంగా వ్యాయామ ప్రాణ యామములు చేయడం మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. గృహ వాహన నిర్మాణ అంశాలలో, ఆర్థిక అంశాలలో తాత్కాలిక ఇబ్బందులు. వారము చివరిలో ప్రశాంతత తగ్గుతుంది, ఆధ్యాత్మిక చింతన చేస్తారు. వాగ్వాదములకు దూరంగా ఉండటం మేలు. ఆర్థిక అంశాలలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నవగ్రహ శ్లోకాన్ని పారాయణ, దేవాలయ సందర్శన మేలు.

5) సింహరాశి...(మఖ, పుబ్బ, ఉత్తర 1వ  పాదం)  (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)

వారం ప్రారంభం ఆకస్మిక ఖర్చులు, అనుకోని ప్రయాణములు.ప్రభుత్వ సంబంధ పని విషయాల్లో బిజీ. టాక్సులు, మొదలైన విషయాల్లోనూ, వ్యక్తిగత ఆరోగ్యముపై శ్రద్ధ తీసుకువాలి. అలసట, విదేశీ విషయాల్లో ఉన్నత విద్యలో శ్రద్ధ. స్త్రీలకు వృత్తి పరముగా కళలకు సంబంధిత అవకాశములు. వారము మధ్యలో  వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలున్న తాత్కాలికము. బద్దకము లేకుండా వాయిదాలు లేకుండా పనులు చేసే ప్రయత్నములు  లో పౌరుషము ఉద్వేగాలకి లోనుకగొడదు.ముఖ్య అంశాలలో తోబుట్టువులతో ఆత్మీయులతో సంప్రదింపుల్లో ఆలోచనలు వాహన,భూసంబంధ స్థిర ఆస్తుల విషయాల్లో.వారము చివరిలో వ్యక్తిగత విషయాల్లో జాగర్తగా అలోచించి నిర్ణయములు మేలు. డబ్బు పొదుపుకిఆలోచనలు,అనవసరఖర్చుకిఅవకాశము లేకుండా ముందుకు వెళ్ళాలి. మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయ స్వామిని పూజించుట మేలు. 

6) కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4  పాదాలు, హస్త  4వ పాదం, చిత్త 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: టో , పా, పి, పూ , షం , ణా, పే,పో)

ఈ రాశి వారికి గృహ నిర్మాణ అంశాలపై దృష్టి సారిస్తారు, సంతాన భవిష్యత్తు పరంగా ఎదురుచూస్తున్న వార్తలు అందుకుంటారు. ప్రభుత్వ సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తి కొరకు ఎదురు చూసేవారికి కొంతవరకు ఆశాజనకంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొనడం, ఆత్మీయులను సంప్రదించను చేస్తారు విద్యార్థులకు విద్యాపరంగా ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టేషనరీ మొదలైనవి కొనడం కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. రుణ సంబంధ విషయాలు కొంతవరకు చెల్లిస్తారు, క్రీడాకారులకు, విద్యార్థులకు విజయం సాధించడానికి పోటీలలో పాల్గొనుటకు చేయు కృషి అధికమవుతుంది. గతంలో ఇచ్చిన రుణములు వసూలు అవుట కొంతవరకు కష్టంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలు ఏర్పడతాయి. వారం చివరిలో సంఘంలో పేరు ప్రతిష్టలు పెరగడం, ముఖ్యమైన విషయాలు విజయం సాధించడానికి చేసే ప్రయత్నం కొంతవరకు ముందుకు జరుగుతుంది. మంచి ఫలితాల కొరకు శ్రీకృష్ణ మందిరాలు దర్శించుట మేలు.

7) తులారాశి...(చిత్త 3 4  పాదాలు, స్వాతి, విశాఖ 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    

వ్యక్తుల సహకారం బాగుంటుంది పరాక్రమం పెరుగుతుంది, నూతన అంశాలు వృత్తిపరంగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో వృత్తిపరమైన ప్రయాణాలు కూడా ఉంటాయి. తల్లి సహకారం పొందుతారు. విద్యార్థులు విద్యాపరమైన అంశాలలో పూర్తి శ్రద్ధ చూపించి విజయాలు సాధిస్తారు. వారం మధ్యలో ఉపాసన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు యందు ఆటంకాలు ఏర్పడతాయి. అయినా వాటిని జయించి ముందుకు వెళతారు. ఆకస్మికంగా ఆర్థికంగా బాగుంటుంది, భాగస్వామికి నూతన అవకాశాలు గుర్తింపు గౌరవం శ్రమకు తగిన ప్రతిఫలం. గతము కన్నా వ్యక్తిగత ఆరోగ్యం కొంతవరకు బాగుంటుంది. వృత్తిలో అధికారుల సహకారం బాగుంటుంది. శ్రమ అధికమైనప్పటికీ కష్టించి పని చేయడం వల్ల పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అధికారులు రాజకీయ నాయకుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందుతారు. వారం చివరిలో వృత్తిలో నూతన అవకాశములు గౌరవం, కృషి శీలత  పెంచుకుంటారు ఆదాయ అభివృద్ధి. ఊహించని వ్యక్తులతో వాగ్వాదములు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. మంచి ఫలితములు కొరకు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సందర్శించుట మేలు.

8) వృశ్చిక రాశి...(విశాఖ  4వ పాదం, అనురాధ, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   

వారం ప్రారంభంలో  మృదువైన మాటలతో అనుకున్న పని సాధించడానికి కృషి చేస్తారు. కుటుంబపరమైన ఖర్చులు అధికంగా శక్తికి మించి ఉన్నప్పటికీ, సమయస్ఫూర్తితో ముందుకు వెళతారు. పరాక్రమం పెరుగుతుంది, క్రింది వారు సహకరిస్తారు ముఖ్యమైన కార్యక్రమంలో నిమగ్నమై ఆహార, విశ్రాంత విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆత్మీయులైన పెద్దలు గురువుల ఆశీస్సులతో వ్యక్తిగత విషయాలలో స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. వారం మధ్యలో గృహ వాహన సంబంధ అంశాలలో పెట్టుబడుల కొరకు, అమ్మకాల కొరకు ఆలోచనలు. తోబుట్టువుల వైఖరి మనసుని ప్రశాంతత లేకుండా చేస్తుంది. తల్లితండ్రుల బంధుమిత్రులతో సంప్రదించి స్థిరాసుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వాహనములు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామి  యొక్క వృత్తిపరంగా అభివృద్ధి చేసే విషయాలలో ఆలోచనలు చేస్తారు. మానసిక శారీరక ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. వారం చివరిలో మనసు ప్రశాంతంగా ఉంటుంది, వినోదాల్లో పాల్గొంటారు. మంచి ఫలితాల కొరకు సత్యనారాయణ స్వామిమందిర సందర్శనమేలు.

9) ధను రాశి...(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ  పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)

వారం ప్రారంభంలో  మనసులోని కోరికలు తీరుతాయి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఉత్సాహంగా ఉంటారు. ఆకస్మిక ధన లాభం, కుటుంబములో చిన్నపాటి ఖర్చులు ఉన్నప్పటికీ, వాగ్దానాలు నిలబెట్టుకోవడం కొంచెం కష్టం. ఇతరులకు వీలైనంతవరకు సలహా ఇవ్వకపోవడం మేలు. కొత్త ప్రదేశాలలో ఆహార స్వీకరణ విషయంలో  ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. విమర్శలకు అవకాశం ఇవ్వద్దు. వారము మధ్యలో తండ్రిగారి సహకారం బాగుంటుంది వాతావరణ సంతృప్తికరంగా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘ కాలికి పెట్టుబడులు వాటి మీద రుణములు తీసుకునుట కొరకు, పాత వాహనములు మార్చి కొత్తవి కొనుగోలు కొరకు ముఖ్యుల సహకారం  ఆశిస్తారు. సంతానమునకు విదేశీ అవకాశములు,  భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి విషయాలలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పోటీలలో విజయం సాధించడానికి  గట్టిగా కృషి చేస్తారు. ప్రైవేటు రంగాల్లో ఉండే వారికి వృత్తి పరంగా ఆదాయ అభివృద్ధి. మంచి ఫలితాల కొరకు శివాలయ సందర్శనమేలు     

10) మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4  పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: భో , జా , జి, ఖి,ఖు, ఖే, ఖో, గా, గి)

ఈ రాశి వారికి ప్రారంభంలో ఏమైనా వస్తువుల కోసం ఖర్చులు అధికంగా పెట్టినప్పటికీ, కుటుంబ వ్యక్తుల ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలి. నిద్రలేమిని అధిగమించాలి. పట్టుదలగా కృషి చేసి అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది, కార్యక్రమాల్లో జయం. పేరు ప్రఖ్యాతలు గౌరవం పెరుగుతుంది. శ్రమకి తగిన గుర్తింపు. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబానికి సంబంధించిన కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళతారు. వారం మధ్యలో కుటుంబంలో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఆర్థికమైన అంశాలలో, ముఖ్యమైన పనిలో కొంత ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నాల్లో ముందుంటారు. మాటల వల్ల అపార్థం రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వాహనమును నడిపేటప్పుడు, భూ సంబంధ పెట్టుబడుల విషయంలోనూ, పోటీలలో, రావలసిన ఆదాయాల్లో, తల్లి గారి ఆరోగ్య సంబంధ విషయాలలో ఎక్కువ ఆచితూచి అడుగు వేయాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు తగదు. విదేశాల్లో ఉండే ఆత్మీయ వ్యక్తుల సహకారం కొంతవరకు ఉంటుంది. వారం చివరిలో కమ్యూనికేషన్ బాగుంటుంది, ఆధ్యాత్మి ప్రయాణాలు చేస్తారు. అసంతృప్తిని అధిగమించే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. మంచి ఫలితాల కోసం సాయిబాబా మందిరాలు దర్శించటమేలు.

11) కుంభ రాశి...(ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    

వారం ప్రారంభంలో ఎదురుచూస్తున్న విషయాలలో ఆశాజనకంగా ఉంటుంది. ధైర్య పరాక్రమాలు పెరుగుతాయి , వృత్తిపరంగా నూతన అవకాశాలకి కొంత అభివృద్ధికరంగా ఉంటుంది. ఉన్నత పదవులలో ఉండేవారు సహకరిస్తారు. పోటీలలో అధిక శ్రమ చూపిస్తారు. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్న , ఆరోగ్యం మీద శ్రద్ధ, రుణములు చెల్లించి అంశాల్లో దృష్టి సారిస్తారు.  వారం మధ్యలో ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు ఆటంకాలు. బద్ధకంతో వాయిదాలు వేస్తారు. అలా కాకుండా యోగ ప్రాణమ యామము చేయడం మంచిది. తోబుట్టువులతో మిత్రులతో అభిప్రాయ బేధములు రాకుండా ఉండాలి. భాగస్వామీ తాత్కాలికి ఎడబాటు. సంతానానికి నూతన అవకాశములు. ఆర్థికపరంగా అభివృద్ధి. తల్లిదండ్రుల  సలహా సహకారంతో స్థిరాస్తి సంబంధ చర్చలు. మంచి ఫలితాల కొరకు విగ్నేశ్వర దేవాలయాల సందర్శనమేలు

12) మీన రాశి...(పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) (నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)

వారం ప్రారంభంలో వృత్తిపరమైన అభివృద్ధి బాధ్యతలు, గౌరవం కీర్తి ప్రతిష్టలు. ఆలోచనలు బావుంటాయి. సృజనాత్మక పెరుగుతుంది. సంతానానికి సంబంధించిన అభివృద్ధి అంశాలలో మీ తరపు ప్రయత్నాలలో, సలహాలలో విజయాన్ని సాధిస్తారు. ఉపాసన బలం పెరుగుతుంది. విందు వినోదాలు సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆత్మీయులకు సలహాలు ఇస్తారు. జ్ఞాపక శక్తి బావుంటుంది. వారం మధ్యలో సంతానానికి సంబంధించి గాని, మీది గాని దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో చాలా ఆలోచనలు చేస్తారు, తొందరపాటుతనం పనికిరాదు. కొత్త వ్యక్తులని త్వరగా నమ్మరాదు. నూతన పరిచయాలు ఆశాభంగాన్ని కలిగిస్తాయి. ఆకస్మిక వాగ్వాదాలకు అవకాశం ఉంది. పట్టింపుల వల్ల ఉద్వేగాలు పెరగడం వల్ల ముఖ్యమైన వ్యక్తులతో, స్త్రీలతో అభిప్రాయ బేధాలకి అవకాశం ఇవ్వరాదు. భాగస్వామికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వారము చివరిలో మానసిక ప్రశాంత ఏర్పడుతుంది. మనసులో కోరికలు తీరుతాయి. భాగస్వామితో సంప్రదించి విదేశీ ప్రయాణాలు  చర్చలు. మంచి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ సందర్శనమేలు.


(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత  జాతకము లోని దశ  అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే  రాశి   ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com