ఉల్లిపాయలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి ఉల్లిపాయలను తిన్న 4 గంటల తర్వాత రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుందని పేర్కొన్నారు. మధుమేహం సమస్య కూడా తగ్గుతుంది. ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్, ప్లేవనాయిడ్స్ ఉండటం వల్ల కీళ్ల నొప్పులు రావు. రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. ప్రతి రోజు 1 లేదా 2 పచ్చి ఉల్లిపాయలు పచ్చిగా తినాలని నిపుణులు చెబుతున్నారు.