యాషెస్ సిరీస్‌లో స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై ఐసీసీ చర్యలకు పూనుకుంది. నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ వేసినందుకు పాయింట్లలో కోత విధించడంతోపాటు జరిమానా కూడా వేసింది. ఆస్ట్రేలియాపై 10 పాయింట్లు, ఇంగ్లండ్‌పై 19 పాయింట్ల కోతను విధించింది. కొత్త నిబంధనల ప్రకారం ఒక్కో తక్కువ ఓవర్‌కు ఒక డబ్ల్యూటీసీ పాయింట్‌తో జరిమానా విధిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది.