ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత స్టార్ పీవీ సింధు నిష్క్రమించింది. క్వార్టర్స్‌లో అమెరికా క్రీడాకారిణి బీవెజ్ జాంగ్ చేతిలో 21-12, 21-17 స్కోరుతో పీవీ సింధు ఓటమి పాలైంది. ఈ సీజన్లో నాలుగోసారి సెమీస్‌లోకి ఎంటర్ కావాలన్న సింధు ఆశలకు బ్రేక్ పడింది. ఆగస్టు 21 నుంచి డెన్మార్క్‌లోని కోపెన్హెగన్లో వరల్డ్ చాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు సింధు ఇలాంటి పేలవ ప్రదర్శన ఇవ్వడం ఆందోళనను కలిగిస్తోంది.