బెర్లిన్ వేదికగా ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. వెన్నం జ్యోతి సురేఖ, ఆదితి స్వామి, పర్నీత్ కౌర్ బృందం పసిడి పతకంతో మెరిగింది. ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో భారత్కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఫైనల్లో భారత్ 235-229 స్కోర్ తేడాతో మెక్సికోపై విజయం సాధించింది.