తరచూ తలనొప్పి వేధిస్తుంటే దాల్చిన చెక్క పొడిని నీటిలో లేదా టీలో వేసుకుని తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పొడిని నీటిలో లేదా గంధంలో కలిపి నుదుటిపై రాస్తే నొప్పి తగ్గుతుంది. అలాగే అల్లం రసం తాగితే నొప్పి తగ్గుతుంది. పుదీనా, లవంగం నీటిలో మరిగించి వడకట్టి తాగితే తలనొప్పి సమస్య ఉండదని పేర్కొంటున్నారు.