మేషం: బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దైవదర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
వృషభం: నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలుకు లోటు ఉండదు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
మిధునం: స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో అప్రయత్నంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి.
కర్కాటకం: ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. దూర ప్రయాణాల్లో శ్రమాధిక్యత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేక అధికారుల ఆగ్రహానికి గురి కావల్సి వస్తుంది.
సింహం: దూర ప్రయాణాల్లో మార్గావరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. వృత్తి వ్యాపారాల్లో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
కన్య: పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
తుల: చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాదిస్తారు. కుటుంబసభ్యులు సలహాలు కొన్ని విషయాల్లో కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. స్ధిరాస్తి సంబంధిత క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.
వృశ్చికం: ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధనపరంగా తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. ఉద్యోగమున సమస్యలు కలుగుతాయి.
ధనస్సు: ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా బంధువులతో వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో స్వంత ఆలోచనలు కలసిరావు. కొందరి మాటల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపారాల్లో భాగస్వాములతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు అధిక శ్రమతో కాని ఫలితం అందదు.
మకరం: బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. గృహమున వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహన భూ లాభాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు.
కుంభం: చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభన కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శ్రమతో కూడిన దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
మీనం: దాయాదులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాల కొరకు ధనం ఖర్చు చేస్తారు. సంఘంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు.