నేడు యానాలోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా టీమిండియా, వెస్టిండీస్ జట్లు మధ్య మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి విజయం సాధించింది.టీమిండియా బ్యాట్స్ మాన్ సూర్యకుమార్ యాదవ్ 44 బంతుల్లో 83 పరుగులు చేసాడు. తిలక్ వర్మ 49 పరుగులు , హార్దిక్ పాండ్యా 20 పరుగులు చేసారు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2, ఒబెద్ మెకాయ్ 1 వికెట్ తీశారు.