ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల కళ్లలో మంటలు, కళ్లకు దురదలు వంటివి ఎక్కువవుతున్నాయి. ఏసీ ఆన్ చెయ్యగానే తలుపులు మూసేయడం వల్ల మన నుంచి రిలీజ్ అయ్యే కార్బన్ డై ఆక్సైడ్‌ను మనమే పీల్చుకునే అవకాశం ఉంది. దీని వల్ల ఆక్సిజన్ తక్కువై తలనొప్పి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఏసీలో ఎక్కువగా ఉంటే బాడీ త్వరగా అలసిపోతుంది. లోబీపీ వచ్చే ప్రమాదం ఉంది. ఏసీలో ఎక్కువగా ఉంటే ఆస్తమా వచ్చే ప్రమాదం కూడా ఉంది.