పెర్ ఫ్యూమ్స్ వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. ఇవి చుట్టు పక్కల వారికి మంచి సువాసనలు కలిగించినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ వాసనలు వారిని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. పెర్ ఫ్యూమ్స్ వల్ల తుమ్ములు రావటం, తలనొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెర్ ఫ్యూమ్స్ ఎక్కువగా వాడితే దురదలు వచ్చే అవకాశం కూడా ఉంది. ముక్కు, కళ్లు, గొంతు నొప్పి, మతిమరుపు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.