వెస్టిండీస్‌తో అమెరికాలోని ఫ్లోరిడా లాడర్‌హిల్ సిటీలో శనివారం జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 178/8 స్కోరు చేసింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక వికెట్ కోల్పోయి 17 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (84*), శుభ్‌మన్ గిల్ (77) అద్భుతంగా రాణించి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో సిరీస్ 2-2తో సమం అయింది.