1) మేషరాశి.... (అశ్విని, భరణి, కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)
ఈ రాశి వారికి ప్రారంభంలో ఆత్మీయుల సహకారం బాగుంటుంది.పరాక్రమం పెరుగుతుంది, తల్లి సహకారం సంపూర్ణంగా పొందుతారు. నూతన అంశాలు వృత్తిపరంగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు విద్యాపరమైన అంశాలలో పూర్తి శ్రద్ధ చూపించి విజయాలు సాధిస్తారు. వృత్తిపరమైన ప్రయాణాలు కూడా ఉంటాయి. వారం మధ్యలో భాగస్వామికి నూతన అవకాశాలు గుర్తింపు గౌరవం శ్రమకు తగిన ప్రతిఫలం. ఆకస్మికంగా ఆర్థికంగా బాగుంటుంది, గతము కన్నా వ్యక్తిగత ఆరోగ్యం కొంతవరకు బాగుంటుంది. అధికారులు రాజకీయ నాయకుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తిలో అధికారుల సహకారం బాగుంటుంది. శ్రమ అధికమైనప్పటికీ కష్టించి పని చేయడం వల్ల పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఉపాసన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు యందు ఆటంకాలు ఏర్పడతాయి. అయినా వాటిని జయించి ముందుకు వెళతారు. వారం చివరిలోవృత్తిలో నూతన అవకాశములు గౌరవం, కృషి శీలత పెంచుకుంటారు ఆదాయ అభివృద్ధి. ఊహించని వ్యక్తులతో వాగ్వాదములు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. మంచి ఫలితములు కొరకు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సందర్శించుట మేలు.
2) వృషభరాశి...(కృతిక 2,3,4 పాదాలు, రోహిణి,మృగశిర 1,2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)
వారం ప్రారంభంలో మృదువైన మాటలతో అనుకున్న పని సాధించడానికి కృషి చేస్తారు. పరాక్రమం పెరుగుతుంది, క్రిందివారు సహకరిస్తారు ఆత్మీయులైన పెద్దలు గురువుల ఆశీస్సులతో వ్యక్తిగత విషయాలలో స్థిర నిర్ణయాలు తీసుకుంటారు.కుటుంబపరమైన ఖర్చులు అధికంగా శక్తికి మించి ఉన్నప్పటికీ, సమయస్ఫూర్తితో ముందుకు వెళతారు. ముఖ్యమైన కార్యక్రమంలో నిమగ్నమై ఆహార, విశ్రాంత విషయంలో నిర్లక్ష్యం తగదు. వారం మధ్యలో వాహనములు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. గృహ వాహన సంబంధ అంశాలలో పెట్టుబడుల కొరకు, అమ్మకాల కొరకు ఆలోచనలు. ఆత్మీయులైన వ్యక్తుల వైఖరి మనసుని ప్రశాంతత లేకుండా చేస్తుంది. మానసిక శారీరక ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. తల్లితండ్రుల బంధుమిత్రులతో సంప్రదించి స్థిరాసుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. భాగస్వామి యొక్క వృత్తిపరంగా అభివృద్ధి చేసే విషయాలలో ఆలోచనలు చేస్తారు. వారం చివరిలో మనసు ప్రశాంతంగా ఉంటుంది, విందువినోదాల్లో పాల్గొంటారు. మంచి ఫలితాల కొరకు సత్యనారాయణ స్వామి మందిర సందర్శనమేలు
3) మిధున రాశి...(మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)
వారం ప్రారంభంలో చుట్టుపక్కల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మనసులోని కోరికలు తీరుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఉత్సాహంగా ఉంటారు. కొత్త ప్రదేశాలలో ఆహార స్వీకరణ విషయంలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం.విమర్శలకు అవకాశం ఇవ్వద్దు. కుటుంబములో చిన్నపాటి ఖర్చులు ఉన్నప్పటికీ, వాగ్దానాలు నిలబెట్టుకోవడం కొంచెం కష్టం. వారము మధ్యలోసంతానమునకు విదేశీ అవకాశములు, తండ్రిగారి సహకారం బాగుంటుంది వాతావరణ సంతృప్తికరంగా ఉంటుంది. ప్రైవేటు రంగాల్లో ఉండే వారికి వృత్తిపరంగా ఆదాయ అభివృద్ధి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘ కాలికి పెట్టుబడులు వాటి మీద రుణములు తీసుకునుట కొరకు, పాత వాహనములు మార్చి కొత్తవి కొనుగోలు కొరకు ముఖ్యుల సహకారం ఆశిస్తారు. పోటీలలో విజయం సాధించడానికి గట్టిగా కృషి చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి విషయాలలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మంచి ఫలితాల కొరకు శివాలయ సందర్శనమేలు.
4) కర్కాటక రాశి...(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)
ఈ రాశి వారికి ప్రారంభంలోనిద్రలేమిని అధిగమించాలి, కుటుంబ సంబంధమైన వస్తువుల కోసం ఖర్చులు అధికం. కుటుంబ వ్యక్తుల ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలి. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబానికి సంబంధించిన కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళతారు. పట్టుదలగా కృషి చేసి అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. శ్రమకి తగిన గుర్తింపు. మనసు ప్రశాంతంగా ఉంటుంది, కార్యక్రమాల్లో జయం. పేరు ప్రఖ్యాతలు గౌరవం పెరుగుతుంది. వారం మధ్యలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు తగదు. విదేశాల్లో ఉండే ఆత్మీయ వ్యక్తుల సహకారం కొంతవరకు ఉంటుంది. ఆర్థికమైన అంశాలలో, ముఖ్యమైన పనిలో కొంత ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నాల్లో ముందుంటారు. మాటల వల్ల అపార్థం రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వాహనమును నడిపేటప్పుడు, భూ సంబంధ పెట్టుబడులవిషయంలోనూ, పోటీలలో, రావలసిన ఆదాయాల్లో, తల్లి గారి ఆరోగ్య సంబంధ విషయాలలో ఎక్కువ ఆచితూచి అడుగు వేయాలి. వారం చివరిలో కమ్యూనికేషన్ బాగుంటుంది, ఆధ్యాత్మి ప్రయాణాలు చేస్తారు. అసంతృప్తిని అధిగమించే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. మంచి ఫలితాల కోసం సాయిబాబా మందిరాలు దర్శించటమేలు.
5) సింహరాశి...(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)
ఈ రాశి వారికి వారం ప్రారంభంలోఎదురుచూస్తున్న విషయాలలో ఆశాజనకంగా ఉంటుంది. ధైర్య పరాక్రమాలు పెరుగుతాయి. పోటీలలో అధిక శ్రమ చూపిస్తారు. వృత్తిపరంగా నూతన అవకాశాలకి కొంత అభివృద్ధికరంగా ఉంటుంది. ఉన్నత పదవులలో ఉండేవారు సహకరిస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ, రుణములు చెల్లించి, శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నములు, మొదలైన అంశాల్లో దృష్టి సారిస్తారు. వారం మధ్యలో తోబుట్టువులతో మిత్రులతో అభిప్రాయ బేధములు రాకుండా ముందడుగు వేయాలి. ముఖ్యమైన విషయాల్లో బద్ధకంతో వాయిదాలు వేస్తారు. ఆలస్యాలు ఆటంకాలు. యోగ ప్రాణయామము చేయడం మంచిది. తల్లిదండ్రుల సలహా సహకారంతో స్థిరాస్తి సంబంధ చర్చలు.సంతానానికి నూతన అవకాశములు. ఆర్థికపరంగా అభివృద్ధి. ఆత్మీయులైన వ్యక్తులతో తాత్కాలికి ఎడబాటు. మంచి ఫలితాల కొరకు విగ్నేశ్వర దేవాలయాల సందర్శన మేలు
6) కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4 పాదాలు, హస్త 4వ పాదం, చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో , పా, పి, పూ , షం , ణా, పే,పో)
వారం ప్రారంభంలో అభివృద్ధి బాధ్యతలు, గౌరవం కీర్తి ప్రతిష్టలు.ఉపాసన బలం పెరుగుతుంది. విందు వినోదాలు సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. వృత్తిపరమైన ఆలోచనలు బావుంటాయి. ఆత్మీయులకు సలహాలు ఇస్తారు. జ్ఞాపక శక్తి బావుంటుంది.సృజనాత్మక పెరుగుతుంది. సంతానానికి సంబంధించిన అభివృద్ధి అంశాలలో మీ తరపు ప్రయత్నాలలో, సలహాలలో విజయాన్ని సాధిస్తారు. వారం మధ్యలోఆకస్మిక వాగ్వాదాలకు అవకాశం ఉంది. పట్టింపుల వల్ల ఉద్వేగాలు పెరగడం వల్ల ముఖ్యమైన వ్యక్తులతో, స్త్రీలతో అభిప్రాయ బేధాలకి అవకాశం ఇవ్వరాదు. కొత్త వ్యక్తులని త్వరగా నమ్మరాదు. నూతన పరిచయాలు ఆశాభంగాన్ని కలిగిస్తాయి. భాగస్వామికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. సంతానానికి సంబంధించి దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో చాలా ఆలోచనలు చేస్తారు, తొందరపాటుతనం పనికిరాదు. వారము చివరిలో మానసిక ప్రశాంత ఏర్పడుతుంది. మనసులో కోరికలు తీరుతాయి. భాగస్వామితో సంప్రదించి విదేశీప్రయాణాల చర్చలు. మంచి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ సందర్శనమేలు.
7) తులారాశి...(చిత్త 3 4 పాదాలు, స్వాతి, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)
ఈ రాశి వారికి వారం ప్రారంభంలోపలుకుబడి కలిగిన అధికార వ్యక్తులతో పాటు రాజకీయ, కళాకారుల సహకారంతో అనుకున్న పనులు చక్కగా నిర్వర్తిస్తారు. క్షేత్ర సందర్శన, గురువులు, కుటుంబ పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, తదుపరి వృత్తిపరమైన బాధ్యతలు. సంతానం విషయంలో క్రొత్త బాధ్యతలు, కొంత ప్రశాంతత లోపించినప్పటికీ ముఖ్యమైన పనుల విషయంలో తగిన వ్యక్తులతో సంప్రదించి ఆలోచనలను చేస్తారు. కుటుంబంలోని వాతావరణ ఆహ్లాదకరంగా మిత్రులతో ఉంటుంది. వారము మధ్యలో లక్ష్య సామర్థ్యము, ధన లాభం, శ్రమ పెరిగినప్పటికీ ఆదాయం అభివృద్ధి. వాయిదా పడిన పనులు ముందుకు వెళతాయి. ఎదురుచూస్తున్న విషయాలలో ఆనందకరమైన వార్తలు. వృత్తిలో అభివృద్ధి కొరకై ఎదురుచూస్తున్న కొత్త అవకాశాలు, గృహ స్థిరాస్తుల విషయంలో ముఖ్యమైన నిర్ణయం కొరకు ఆత్మీయులను సంప్రదిస్తారు. అధిక ఆదాయమునకు చేయు కృషి సత్ఫలితాలను ఇస్తుంది. కొత్త వ్యాపారంల కొరకు ప్రణాళికలు వేస్తారు. వారాంతంలో సమావేశాల్లో పాల్గొంటారు.స్త్రీల ఆరోగ్యం పై శ్రద్ధ ఖర్చులు పెరుగుతాయి రుణాలు చెల్లిస్తారు. మంచి ఫలితాలు కొరకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం సందర్శన మేలు.
8) వృశ్చిక రాశి...(విశాఖ 4వ పాదం, అనురాధ, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)
ఈ రాశి వారికి వారం ప్రారంభంలోమాటల వల్ల ఆకస్మిక కలహాలు లేకుండా జాగ్రత్త వహించాలి. పనులు వాయిదా పడకుండా ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలి. రావలసిన ధనం కొంత వాయిదా పడుతుంది.ఊహించని ఖర్చులు అధికంగా ఉంటాయి. స్త్రీల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. వారం మధ్యలో స్త్రీ సంతానానికి విద్య, వృత్తి అంశాలలో దూర ప్రదేశాలలో నూతన అవకాశాలు. విద్యార్థులకు ప్రాథమిక విద్య మీద ఆసక్తి పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు మిత్రులను కలుస్తారు భాగస్వామికి కొత్త ప్రదేశానికి బదిలీలు. నూతన గృహ ప్రయత్నాలకు అవకాశము, ముఖ్యుల సహకారంతో నిర్ణయి సామర్థ్యం పెరుగుతుంది. మధ్యలో వృత్తిలో నూతన బాధ్యతలు, శ్రమ అలసట పెరిగినప్పటికీ గౌరవము కీర్తి పెరుగుతుంది. వారము చివరిలో.మిత్రులు తోబుట్టువులు సహకరిస్తారు, సంతోష్కరమైన వాతావరణ. వాయిదా పడ్డ పనులు ముందు కదులుతాయి,శుభ విషయాలు నిమిత్తమై ఖర్చులు అధికమవుతాయి మంచి ఫలితాలు కొరకు దుర్గాదేవి ఆరాధన మంచిది
9) ధను రాశి...(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)
వారం ప్రారంభంలో శ్రమకి తగిన గుర్తింపు గౌరవం. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆకస్మిక చిన్నపాటి ప్రయాణాలు, కొంత అలసట. సంఘ సేవ చేస్తారు. సంఘంలో గుర్తింపు గౌరవం అవార్డులో అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు. సహకారాలు. కొంత మానసిక సంతృప్తి ఉంటుంది. వారం మధ్యలో ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెరుగుతుంది వ్యాయామం చాలా మంచిది. వైరాగ్య భావనల్ని అసంతృప్తిని అధిగమించాలి. అనుకోని ఖర్చులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ సమయానికి సర్దుబాటు చేసుకుంటారు. పరాక్రమం ధైర్యం పెరుగుతుంది. రుణాల చెల్లిస్తారు. నూతన విద్యా విషయాలు తెలుసుకుంటారు. సంతానము ఉన్నత విద్యా విషయంలో విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. తోబుట్టువుల సహకారంతో అపార్ధాలు రాకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వారం చివరిలో వృత్తిపరమైన బాధ్యతలు పెరుగుతాయి, వృత్తిపరమైన ఆదాయం లభిస్తుంది. గౌరవము,శ్రమ. మంచి ఫలితాలు కొరకు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు సందర్శించుట మేలు.
10) మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భో , జా , జి, ఖి,ఖు, ఖే, ఖో, గా, గి)
వారం ప్రారంభంలో శత్రువులపై విజయం సాధిస్తారు. శారీరక శ్రద్ధ పెరుగుతుంది వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది సంఘంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో తోబుట్టువులతో, సంతానముతో అపార్ధాలు రాకుండా మాట పట్టింపులు లేకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి దర్పంగా ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయాలలో ముందుకు వెళ్లడం కొరకు పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. వారం మధ్యలో ఆరోగ్య విషయంలో బద్ధకించకుండా ప్రణాళికా పరంగా వ్యాయామ ప్రాణయామములు చేయడంమంచిది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. గృహ వాహన నిర్మాణ అంశాలలో, ఆర్థిక అంశాలలో తాత్కాలిక ఇబ్బందులు. వారము చివరిలో ప్రశాంతత పెంచుకునే దిశగా ఆలోచనలుచేయాలి, ఆధ్యాత్మిక చింతన చేస్తారు. వాగ్వాదములకు దూరంగా ఉండటం మేలు. ఆర్థిక అంశాలలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు నవగ్రహ శ్లోకాన్ని పారాయణ, దేవాలయ సందర్శన మేలు.
11) కుంభ రాశి...(ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)
వారం ప్రారంభం ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. ఆకస్మిక ఖర్చులు, అనుకోని ప్రయాణములు.వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కొత్త నిర్ణయాలు చేయడానికి పాత మిత్రులను సంప్రదిస్తారు. విదేశీ విషయాల్లో ఉన్నత విద్యలో శ్రద్ధ. స్త్రీలకు వృత్తి పరముగా కళలకు సంబంధిత అవకాశములు. ప్రభుత్వ సంబంధ పని విషయాల్లో బిజీ. టాక్సులు, మొదలైన విషయాల్లోనూ, వ్యక్తిగత అలసట, ఆరోగ్యముపై శ్రద్ధ తీసుకువాలి. వారము మధ్యలో ముఖ్య అంశాలలో స్నేహితులతో, ఆత్మీయులతో సంప్రదింపుల్లో ఆలోచనలు వాహన, భూసంబంధ స్థిర ఆస్తుల విషయాల్లో బద్దకము లేకుండా వాయిదాలు లేకుండా పనులు చేసే ప్రయత్నములు లో పౌరుషము ఉద్వేగాలకి లోను కాకూడదు. వారము చివరిలో వ్యక్తిగత విషయాల్లో జాగర్తగా అలోచించి నిర్ణయములు మేలు. డబ్బుపొదుపుకి ఆలోచనలు అవసరము. అనవసర ఖర్చుకి అవకాశము లేకుండా ముందుకు వెళ్ళాలి. మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయ స్వామిని పూజించుట మేలు.
12) మీన రాశి...(పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) (నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)
వారం ప్రారంభంలో ఈ రాశి వారు విద్యార్థులకు విద్యాపరంగా ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టేషనరీ మొదలైనవి కొనడం కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రభుత్వ సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. గృహ నిర్మాణ, వాహన కొనుగోలు అంశాలపై దృష్టి సారిస్తారు. నూతన వృత్తి కొరకు ఎదురు చూసేవారికి కొంతవరకు ఆశాజనకంగా ఉంటుంది. సంతాన భవిష్యత్తు పరంగా ఎదురుచూస్తున్న వార్తలు అందుకుంటారు. క్రీడాకారులకు, విద్యార్థులకు విజయం సాధించడానికి పోటీలలో పాల్గొనుటకు చేయు కృషి అధికమవుతుంది.విందు వినోదాల్లో పాల్గొనడం, ఆత్మీయులను సంప్రదించడం చేస్తారు. రుణ సంబంధ విషయాలు కొంతవరకు చెల్లిస్తారు. గతంలో ఇచ్చిన రుణములు వసూలు అవుట కొంతవరకు కష్టంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాలు విజయం సాధించడానికి చేసే ప్రయత్నం కొంత వరకు ముందుకు జరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలు ఏర్పడతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి ఫలితాల కొరకు శ్రీకృష్ణ మందిరాలు దర్శించుట మేలు.
(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)