మన శరీరంలో జరిగే అనేక ప్రక్రియలు మన ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి. పులియబెట్టే ప్రక్రియ ద్వారా తయారు చేసే ఇడ్లీ, దోశ, ఊతప్పం, వీటితో పాటు బ్రెడ్, బన్స్ లోని ప్రోబయోటిక్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే సోయా పాలు, పెరుగు, మజ్జిగల ద్వారా పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుందని, నోటి సమస్యలు అలర్జీ వంటివి దరి చేరవని పేర్కొంటున్నారు.