ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా మూడో స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా (118), ఆ తర్వాత పాకిస్థాన్ (116) ఉన్నాయి. ఇక భారత్ (113) మూడో స్థానంలోనే నిలిచింది. వన్డే ఫార్మాట్లో శుభ్మన్ గిల్ (743 పాయింట్లు) ఐదో స్థానంలో, విరాట్ కోహ్లీ (705) తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు. వన్డే బౌలర్ల జాబితాలో మహమ్మద్ సిరాజ్ (670) నాలుగు, కుల్దీప్ యాదవ్ (622) పదో స్థానంలో ఉన్నారు.