బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,300గా ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.59,230గా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.100 మేర పెరిగింది. వెండి కిలో ధర రూ.500ల మేర పెరిగి రూ.75,300లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.