ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్, ఇన్ఫోసిస్‌కే చెందిన డిజిటల్ ఇన్నోవేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అంతర్జాతీయ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఈ భాగస్వామ్యం అమల్లో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ఫోసిస్ డిజిటల్ రంగంలో తనకున్న అనుభవంతో టెన్నిస్ క్రీడకు కూడా సేవలు అందించే తీరు తనకు నచ్చిందని నాదల్ ఈ సందర్భంగా చెప్పాడు.