తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 18 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని శుక్రవారం టీటీడీ అధికారులు తెలిపారు. ఆర్జిత టోకెన్లు పొందిన వారికి 4-5 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, గురువారం హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa