ఎవరైతే డైట్ లో ఉప్పు మానేస్తారో వారికి గుండెపోటు, గుండె సంబంధ వ్యాధుల ముప్పు 20 శాతం మేర తగ్గిపోతుందని యూకే పరిశోధకులు తేల్చారు. గుండె సంబంధ వ్యాధులుండి 40-70 ఏళ్ల వయసున్న 5 లక్షల మందిపై అధ్యయనం చేయగా, ఉప్పు తినని వారికి వ్యాధుల ముప్పు 18 శాతం మేర తగ్గిపోయినట్లు తేల్చారు. ముఖ్యంగా ఆర్ట్రియల్ ఫిబ్రిలేషన్ (గుండె దడ) తగ్గిపోతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.