టీమిండియా వెటరన్ ఆటగాడు, కర్ణాటక స్టార్ కరుణ్ నాయర్ దేశవాలీ క్రికెట్లో కర్ణాటక జట్టుకు గుడ్ బై చెప్పాడు. ఇకపై విదర్భ క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడాలని కరుణ్ నాయర్ నిర్ణయించుకున్నాడు. ‘‘కర్ణాటక క్రికెట్ అసోసియేషన్తో గత రెండు దశాబ్దాలగా ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన కేఎస్సీఈకు ధన్యవాదాలు‘‘ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో ఓ పోస్టు చేశాడు.