ఆసియా కప్ అనగానే అందరి కళ్లు భారత్, పాక్ పోరు మీదే ఉంటుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ఆసియా కప్ లో ఈ 2 జట్లు రెండు, మూడుసార్లు తలపడే అవకాశం ఉంది. మొదటి గ్రూప్ దశలో, తర్వాత సూపర్ – 4 దశలో ఆడటమైతే ఖాయంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థుల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.