దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే ఊగిసలాడగా.. తరువాత పుంజుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 110 పాయింట్లు లాభపడి 64,996 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి 19,306 దగ్గర నిలిచింది. ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ఫార్మా, మారుతీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.