దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెప్టెంబరు నెలకు స్వల్ప లాభాలతో స్వాగతం పలికాయి. సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంతో 64,921 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు లాభపడి 19,297 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్‌గ్రిడ్, ఎంఅండ్ఎం, ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, విప్రో, షేర్లు నష్టాల్లో ఉన్నాయి.