దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 19 పాయింట్ల నష్టంతో 65,760 దగ్గర , నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప నష్టంతో 19,569 దగ్గర కొనసాగుతోంది. విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్స్, సన్‌ఫార్మా, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, మారుతీ, టాటా స్టీల్, టాటా మోటార్స్షేర్లు నష్టాల్లో ఉన్నాయి.