శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే ఆహారం పాలు. ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగాలని అంటుంటారు నిపుణులు. పాలలో కాల్షియంతోపాటు పోషకాలు కూడా అనేకం ఉన్నాయి. లాక్టోస్, ఇన్ టాలరెన్స్ సమస్య లేకపోతే పాలలో చిటికెడు సోంపు కలుపుకుని తాగవచ్చు. సోంపులో ఉండే చల్లని, తీపి గుణాల కారణంగా ఈ జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సోంపును పాలల్లో కలిపి తాగాలి.