బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో ఏపీలో మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. రాష్ట్రంలోని గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, అల్లూరి, పార్వతీపురం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది, కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.