దేశంలో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.55,000 వద్ద ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గి రూ.60,000 వద్ద ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. కేజీ వెండి రూ. 500 తగ్గి రూ. 78,500 గా ఉంది. తెలంగాణ, ఏపీలో ఇవే ధరలు అమలులో ఉండనున్నాయి.