బెల్లం, కొబ్బరను కలిపి తినడం వల్ల దగ్గు, జలుబు సమస్యల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. గోరు వెచ్చని నీటిలో కొంచెం బెల్లం వేసుకుని లేదా.. టీ లో చక్కెరకు బదులుగా బెల్లాన్ని వేసి తాగినా శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కొబ్బర బెల్లంను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కొబ్బర, బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది.