దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 201.35 పాయింట్ల లాభంతో 66790.04 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 70.80 పాయింట్ల లాభంతో 19888 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.93 దగ్గర ప్రారంభమైంది. టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ ఎంటర్ప్రైజెస్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్ వంటి సంస్థలు ఉన్నాయి.