ఆసియాకప్-2023 సూపర్-4లో పాకిస్తాన్ బౌలర్లకు భారత ఓపెనర్లు చుక్కలు చూపించారు. రోహిత్(56), గిల్(58) పరుగులతో టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఈ సమయంలోనే వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. దీనిపై పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ.. ‘బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై బాబర్ బ్యాటింగ్ ఎంచుకోవడం ఆశ్చర్యపరిచింది. అది తెలివైన నిర్ణయంకాదు. ఈ మ్యాచ్‌లో మా జట్టును వర్షం కాపాడింద’ని తెలిపారు.