సనాతన హైందవ ధర్మంలో దేహం అత్యంత దృడంగా, బలవంతంగా, శక్తివంతంగా ఉండాలంటే 'విశ్రాంతి' అత్యంత అవసరమని శాస్త్రం చెబుతోంది. స్వచ్ఛమైన గాలి, నీరు, శుద్ధమైన భోజనంతో పాటు విశ్రాంతిని కూడా ఆహారంలో చేర్చింది. శరీరానికి నీరు, కూరగాయలు, ఆకుకూరలు, బలవర్ధకమైన ఆహారం ఎంత అవసరమో.. విశ్రాంతి కూడా అంతే అవసరమని పేర్కొంది. అలసి పోయిన శరీరం విశ్రాంతి తీసుకొంటే.. అవయవాలన్నీ తేజస్సుతో పనిచేయడమే కాక రోగనిరోధక శక్తిని కూడా పెరుగుతోంది.