వన్డే ప్రపంచకప్-2023కి ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్ నసీం షా వన్డే వరల్డ్‌కప్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌కు గాయం కారణంగా నసీం షా దూరంగా ఉన్నాడు. భారత్ వేదికగా అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్ టోర్నీ వరకు నసీం గాయం నుంచి కోలుకునే అవకాశం లేదు.