సాధారణంగా నిద్రపోయే ముందు లేదా అలసటగా అనిపించినపుడు ఆవలింత వస్తుంది. అలా కాకుండా మరికొన్ని సందర్భాల్లోనూ ఆవలింతలు వస్తాయి. మగతగా ఉండటం, విసుగు అనిపించడం లేదా అలసటగా ఉన్నప్పుడు, నిద్ర లేమి, దీర్ఘకాలికమైన ఒత్తిడి, డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఆవలింతలు వస్తాయి. ఆవలింతలు తగ్గడానికి రోజూ సరైన నిద్ర అవసరం. మధ్యాహ్నం అతిగా నిద్రపోవడం నివారించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.