పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్ గెలిచి కప్పు గెలిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తెలిపారు. అనేక సంవత్సరాలుగా టీమిండియా జట్టు నిలకడగా ఆడుతుందని.. ప్లేయర్స్ అంతా మంచి ఫాంలో ఉన్నారని పేర్కొన్నారు. భారత జట్టు బలంగా ఉందనేది వాస్తవమని తెలిపారు. ఆటగాళ్ల అంకిత భావం, కఠోర శ్రమ ఈ విషయాన్ని తెలియజేస్తుందని కపిల్ పేర్కొన్నారు.