చాలా మంది ప్రస్తుతం దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఇలాంటి వారంతా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా టమాటా, నారింజ, నిమ్మ వంటి పుల్లనివి తినకూడదు. కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూసులు, ఐస్క్రీములకు దూరంగా ఉండాలి. వీటితో గొంతునొప్పి పెరిగే అవకాశం ఉంది. మసాలాలతో కూడిన పదార్థాలు తింటే పొడి దగ్గు మరింత పెరుగుతుంది. పెరుగు తింటే కఫం పెరిగే అవకాశం ఉంది. వైద్యులను సంప్రదించడం మంచిది.