కెప్టెన్సీపై కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కెప్టెన్గా వ్యవహరించడం ఇది నాకు మొదటిసారేం కాదు. ఇప్పటికే సారథిగా చాలా మ్యాచ్ల్లో జట్టును గెలిపించాను. కెప్టెన్సీ అంటే నాకు ఇష్టం. సారథిగా జట్టును ఎలా నడిపించాలో అలవాటు పడ్డాను. కొలంబోలో ఆడి వచ్చిన అనుభవంతో ఈ మ్యాచ్ ప్రారంభంలో మైదాన పరిస్థితులు స్వర్గాన్ని తలపించాయి’’ అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.