ఊపిరితిత్తుల సమస్యలుంటే కొన్ని లక్షణాలు బయటపడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎక్కువ కాలం కఫం, పెద్దగా గురక పెట్టడం, శ్వాసకోశంలో రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. పౌష్టికాహారం తీసుకోవడం, శ్వాసకి సంబంధించిన వ్యాయామాలతో లంగ్స్ సమస్యలు నివారించొచ్చని సూచిస్తున్నారు.