అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 66,054 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 19,693 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.