తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ 9వ రోజు చక్రస్నానం నిర్వహించారు. అంతకుముందు వరాహస్వామి ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అనుమతించారు. భక్తుల గోవింద నామాలతో తీరు వీధులన్నీ మారుమోగాయి. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.