ఆసియా క్రీడల్లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో ఐష్వరి ప్రతాప్ సింగ్, స్వప్నిల్ కుశాలె, అఖిల్ షిరన్ బృందం గోల్డ్ సొంతం చేసుకుంది. దీంతో భారత్ 1,769 పాయింట్లతో ప్రపంచ రికార్డును నమోదు చేసింది. గత ఏడాది అమెరికా నెలకొల్పిన రికార్డును 8 పాయింట్ల తేడాతో భారత త్రయం బ్రేక్ చేసింది.