ఆసియా క్రీడల్లో భాగంగా గ్రూప్ Aలో బంగ్లాదేశ్తో మంగళవారం జరిగిన కబడ్డీ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. 55-18 స్కోరు తేడాతో భారీ విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది. ఆట సగం పూర్తయ్యే సమయానికే 24-9 స్కోరు తేడాతో ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. భారత జట్టులో రైడర్లతో పాటు డిఫెండర్లు రాణించడంతో ప్రత్యర్థిని 8 సార్లు ఆలౌట్ చేశారు. ఇక భారత్ తన తదుపరి మ్యాచ్ను బుధవారం థాయిలాండ్లో ఆడనుంది.