భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు బుధవారం విడాకులు మంజూరు చేసింది. అతడి భార్య క్రూర ప్రవర్తన కారణంగానే ఈ తీర్పు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీని 2012లో ధావన్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. మనస్పర్థలు రావడంతో 2020 నుంచి వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు.